43 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
ఈ కరోనా ఆపద సమయంలో, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనాలు తో 43 రోజులుగా నిర్విరామంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుచున్నవి,..
పేద బ్రాహ్మణులకు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేయూత
1 లాక్ డౌన్ తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీతానగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అండగా నిలిచారు. పూజలు పురోహితం పై ఆధారపడిన బ్రాహ్మణులకు బియ్యం, నిత్యావసర సరుకులు పండ్లు, కూరగాయలు, సంభావన మాస్కులు, శానిటైజర్లు అందించారు
2. సీతానగరం పరిసర ప్రాంతాల్లో లాక్ డౌన్ వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 100 మంది పేద మత్స్యకారులకు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఉచితంగా మాస్కులు, శానిటైజెర్లు, బియ్యం, కూరగాయలు, పండ్లు అందించారు
3. 14.5.2020 గురువారం రోజున తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో బాల భోగం పోపన్నం 140 మందికి కదంబం (సాంబార్ రైస్ )310 మందికి మరియు
4. తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న టువంటి డాక్టర్లకి బాల భోగం పోపన్నం 40 మందికి కదంబం ( సాంబార్ రైస్ ) 55 మందికి .
5. తాడేపల్లి బోట్ యార్డ్ సమీపంలో ఉన్న 130 మంది అన్నార్తులకు కదంబం( సాంబార్ రైస్ ) అందించారు.
6. వివిధ ప్రాంతాల నుంచి నడిచి వస్తున్నా 250 మంది వలస కూలీలకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కదంబం
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఆహారం అందించారు. ఈ సేవ కార్యక్రమంలో శ్రీమతి దుర్గ గారు, శ్రీమాన్ విశ్వనాధ్ గారు, శ్రీమాన్ రఘునాథ్ గారు పాల్గొన్నారు
ఈ రోజు మొత్తం 180 మందికి బాల భోగం పోపన్నం. ... 650 మందికి కదంబం అందించడం జరిగింది. 🙏జై శ్రీమన్నారాయణ🙏